March 31, 2007

తెలుగుదేశం - తప్పులు

దిద్దుకోవాల్సిన తప్పుల్ని రాసుకొచ్చాడు సార్‌.

March 30, 2007

అవినీతి

నివేదిక ప్రకారం ముప్పాతిక శాతం అవినీతి అధికారులేనని ఉంది
. మరి నా వాటా అంత తక్కువగా వస్తోందేంటి, ఇంతకాలం

March 29, 2007

నేర రాజకీయాలు

టిక్కెట్లన్నీ ఘరానా దొంగలకూ, ఖూనీకోర్లకే ఇచ్చారు.
చిల్లర దొంగలకీ వెనుకబడ్డ నేరగాళ్లకీ ఇవ్వపోవటం అన్యాయం సార్‌.

March 28, 2007

క్రమబద్దీకరణ

ఇచ్చిన దానితో సంతృప్తి చెందాలి. హుసేన్‌సాగర్‌నీ సెక్రటేరియట్‌ని
కూడా నీ పేరున క్రమబద్ధీకరించాలంటే కుదరదు.

March 27, 2007

మనిషి - గొర్రె

గొర్రెల్లా ఉండే మనుషులున్నట్టుగానే మనిషితత్వం
ఉన్న గొర్రెలూ ఉంటాయి. విచిత్రమేముంది

March 26, 2007

కొత్తగా రాజకీయ పార్టీలో చేరిన వారికి శిక్షణ

కొత్త సభ్యులకు శిక్షణ తరగతులు పెట్టాం

March 25, 2007

Team India


March 24, 2007

జైలు నుంచి nomination

నన్ను గెలిపిస్తే ఈ జైలుకు కన్నంవేసి
మిమ్మల్ని విడుదలచేస్తా!

March 23, 2007

Nomination పదవులు

నృత్య కళాకారుడిగా నిన్నూ, ఈయన్ని కవిగా
ఆయన్ని చిత్రకారుడిగా, ఇతన్ని మేధావిగా నామినేట్‌
చేయిస్తానయ్యా బాధపడకండి!

March 22, 2007

World water day

నదులూ, నదాలూ ఎండిపోతాయట అప్పుడిక
మనం స్నానాలకి కూడా మినరల్‌వాటర్‌ కొనుక్కోవాల్సిందే!

March 21, 2007

రాష్ట్రపతి (అబ్దుల్ కలాం) పొదుపు


బార్బర్‌ ఖర్చులేదు, పిల్లల ఖర్చూ, ఫీజులూ
లేవు, చీరలూ, నగలూ కొనాల్సిన పనిలేదు...

March 20, 2007

ఉగాది వివాదం - ఉపాయం


ఇవాళ పండక్కి నువ్వూ అల్లుడూ వస్తున్నారని
ఉగాది నిన్ననే జరిపించాడు మీనాన్న. ఎంత చెప్పినా విన్లా.

March 19, 2007

పంచాంగ శ్రవణం తిరస్కృతి

పంచాంగంలో ఉన్నది ఉన్నట్టు చెబితే సారుకు కోపం
రావచ్చని ఏదో సాకు చెప్పి సున్నితంగా తిరస్కరించా!

March 18, 2007

పత్రికల వారి పై దౌర్జన్యం


పాకిస్థాన్‌లో పత్రికలవాళ్లని చితక్కొట్టి
టీవీ ఛానల్‌ మూసేశారు సార్‌!!

March 17, 2007

పంచాంగ శ్రవణం


నక్షత్రాలు అనుకూలంగా ఉన్నాయి,
గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి సార్‌.

March 16, 2007

రాజశేఖర రెడ్డి పాలన - వివాదాలు

ఎందుకుసార్‌, మన పాలనలో వివాదంకానిది ఏదీలేదు.
ఉగాది పండగా, సూర్యగ్రహణాలు కూడా వివాదగ్రస్తమయ్యాయి.

March 15, 2007

మాయావతి - UP ఎన్నికలు

ఎన్నికల్లో నుంచోదట. ఆనకవచ్చి
కూర్చోమంటే కూర్చుంటారట.

March 14, 2007

Assemblyలో అసభ్య పదజాలం

ఇవాళ తిట్టబోయే అన్‌పార్లమెంటరీ మాటలకి
ముందే క్షమాపణ కోరుతున్నా!

March 12, 2007

assembly నియోజక వర్గాల పునర్విభజన


పునర్విభజనవల్ల ఇటువైపు రిజర్వుడు
నియోజకవర్గంలోకీ, అటువైపు జనరల్‌లోకీ వచ్చాను సార్‌

March 11, 2007

సంపన్నుల దేశం


మనం గర్వించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయిరా

March 10, 2007

అవినీతిపరులకు శిక్ష

ఉన్నపళంగా వేలాది, లక్షలాది కరెంటు
స్తంభాల్ని ఎక్కడినుంచి తెస్తాం?

March 9, 2007

రైతుల భూముల దురాక్రమణ

కబ్జాకోర్లు వచ్చి మొత్తం లాగేసుకుంటే
ఏమీ అనవు కాని చిన్న చిన్న పిట్టలు వస్తే
వడిసేలతో కొడతావు, దిష్టిబొమ్మలు
పెట్టి భయపెడతావు...

March 7, 2007

నీళ్ళు లేకున్నా మీటర్లు

సరఫరా లేకున్నా నీళ్లు తాగటం మానరు
కదయ్యా, నీటిమీటర్లు నోటికి బిగిస్తున్నాం పట్టు.

March 6, 2007

ఇళ్ళ పధకంలో అవినీతి

అతను బొమ్మరిల్లూ, ఇతను పొదరిల్లూ,
ఆయన పేకమేడా ఈయన గాలిమేడా కడుతున్నారయ్యా,
పక్కా ఇళ్ల పథకంలో డబ్బివ్వు.

March 5, 2007

మంత్రివర్గంలో చుట్టాలు


క్యాబినెట్‌ మీటింగులో నన్ను పెద్దమామా,
తాతయ్యా, బావగారూ, చిన్నాన్నా అని
వరసలతో పిలవకండయ్యా

March 4, 2007

క్వార్టర్‍లు ఖాళీ చేయని నాయకులు

వాస్తు దోషం ఉందని చెప్పు పది నిమిషాల్లో
మూటాముళ్లే సర్దుకుని పారిపోతారు.

March 3, 2007

March 2, 2007

ప్రార్ధన


March 1, 2007

పన్ను తగ్గింపులు

వాటి ధరలు మాత్రమే
అందుబాటులో ఉన్నాయి మరి.