సందర్భం:
మరో ఏడాదిన్నరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే ప్రక్రియ మొదలైంది. గురువారం ఇందిరమ్మ కార్యక్రమంపై కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ మేరకు సంకేతాలిచ్చారు. ''ఏడాదిన్నరలో మేం పరీక్షలకు కూర్చుంటాం, మమ్మల్ని పాస్ చేయించేది మీరే'' అంటూ ఆయన పరోక్షంగా ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఇందిరమ్మ గృహ నిర్మాణంతోపాటు ఇతర పథకాలకు నిర్దేశించిన లక్ష్యాలను సత్వరమే సాధించాలని ఆదేశించారు. అధికారుల పనితీరే తమకు ప్రామాణికమని, వారంతా చక్కగా పనిచేస్తేనే తాము ప్రజాదరణ పొందుతామని వైఎస్ వ్యాఖ్యానించడం విశేషం. ''అందరు చక్కగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఎన్నికల్లో గెలవడం కోసమని కాదు. ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా అని చూడాలి'' అని సీఎం అన్నారు. కొందరు అధికారుల పనితీరు బాగా లేదని, దానివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment