June 30, 2007

సామాన్యులకు అంతరిక్షయానం


June 29, 2007

ఆత్మలతో మాట్లాడిన ప్రతిభా పాటిల్

భూతవైద్యుడు సార్‌, పనేమైనా ఉందేమోనని వచ్చాడు.

June 28, 2007

మరో పది వేల సమర యోధులకు పింఛన్లు

కంగ్రాట్స్‌ తాతయ్యా, మీకు సమరయోధుల పెన్షన్‌ మంజూరయింది.

June 27, 2007

వర్షాలకి ప్రాజెక్టులకు గండ్లు

మట్టికుండలు మీ ప్రాజెక్టులకన్నా గట్టివి సార్‌,
నీళ్లుపోస్తే పగలవు, వానకి తడిసినా ఏంకాదు.

June 26, 2007

మరో వాయుగండం

మళ్లీ అంతదూరం నుంచి రావటం కష్టం సార్‌. ఇక్కడే
ఉండి మరో తుఫానుకీ పరామర్శించి వెళ్లండి..

June 25, 2007

కొత్త పుస్తకాల పంపిణీలో ప్రభుత్వం విఫలం

పాఠ్య పుస్తకాలింకా రాలేదు, ఏం చేసేది, వార పత్రికలూ,
సినిమా పత్రికలూ కొని చదివిస్తున్నాం...

June 24, 2007

వరద సహాయం

దాన్ని ముంబాయి నుంచి తెప్పించారు,
ఇది కర్ణాటక నుంచి వచ్చింది,
అది మిలిటరీది, ఇది చెన్నై నుంచీ,
అది రాష్ట్ర ప్రభుత్వానిది, ఇది ప్రైవేటు...

June 23, 2007

రాష్ట్రంలో వరదలు

నిన్ను పరామర్శించటానికి రాలేదయ్యా, కొట్టుకుపోయి ఇటు వచ్చా

June 22, 2007

June 21, 2007

ఊరంతా షాక్

మాకు కాదుసార్‌, ఏడుగంటల ఉచిత కరెంటు పొలాలకివ్వండి!

June 20, 2007

తృతీయ కూటమి పేరు

కూటమికి పేరు పెట్టటం చాలా సింపుల్‌

June 19, 2007

పార్టీ వారంతా ఐక్యంగా ఉండాలి

చిన్నప్పటినుంచీ లేనిది ఒక్కసారిగా 'ఐక్యంగా ఉండాలని'
పార్టీవారికి చెప్పేసరికి భయంవేసి తెచ్చాసార్‌!

June 17, 2007

June 16, 2007

కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్ధి - ప్రతిభా షేకావత్ పాటిల్

పాటిల్‌ పేరుంది, షేకావత్‌ పేరుంది,
కమ్యూనిస్టులు కోరినట్టుగా మహిళా అభ్యర్థి...
గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర మూడు
రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

June 15, 2007

రాష్ట్రపతి పదవి - జోస్యం

రాశిఫలం ప్రకారం మీరే రాష్ట్రపతి సార్‌, గ్రహబలం బాలేదు.

June 14, 2007

కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్ధి

సోనియాజీని చూసి నేను ఇంతకిందికి వంగా.
రాష్ట్రపతి అభ్యర్థిగా నన్నే పంపుతారు.

June 13, 2007

వై యెస్ - ప్రతిపక్షాలపై దుమ్మెతి పోత

ఇక నువ్వేం దుమ్ము దులపక్కర్లా, ప్రతిపక్షాలపై
పోయటానికట సారు పొద్దునే దుమ్మంతా వూడ్చుకెళ్తున్నారు.

June 11, 2007

విద్యా శాఖ వైఫల్యాలు

ఇంకా పుస్తకాలు ఎందుకు తేలా? డ్రాపౌట్స్‌ ఎందుకు పెరుగుతున్నాయి.
స్కూలు భవనాలు ఎందుకు లేవు? ప్రైవేటు విద్యపై నియంత్రణ లేదెందుకు?

June 10, 2007

K .A.Paul ఆరోపణలు

అసాధ్యం. మా సారు ఆఫ్టరాల్‌ 20 కోట్లు అడుగుతారా...

June 9, 2007

ముఖ్యమంత్రికి PJR లేఖ

మా జనార్ధన్‌రెడ్డిని తీసుకుని మీ జనార్ధన్‌రెడ్డిని ఇస్తావా?

June 7, 2007

రాజశేఖర రేడ్డి పాలన - కడప ఫైళ్ళు

అధికారులూ, అనుమతులూ, సంతకాలూ అక్కర్లేదయ్యా.
అది కడప ఫైలు దానంతట అదే పరుగెత్తుతుంది.

June 6, 2007

జైల్లో రైతులు

రైతుల్ని జైల్లోపెట్టటానికి జాగా కావాలయ్యా.
కనుక ఖైదీల్ని వదిలేస్తున్నాం.

June 5, 2007

కుక్కల బెడద

ఇక వీధికుక్కలకి భయపడాల్సిన పనిలేదయ్యా.
కుక్కకాటు మందుకి కొరతలేకుండా చేస్తున్నాం.

June 4, 2007

వానలు, సేద్యానికి నీరు పై ప్రభుత్వ ప్రకటనలు

అదిగో వానలు వస్తున్నాయి సార్‌, ఇంకో 85 లక్షల
ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పేద్దాం.

June 2, 2007

భూకబ్జాలు

సరిగాచూడు, ఇక్కడకాదు, యూపీలో, ఇక్కడ కబ్జాలని అరెస్టులు చేస్తే ఎవరూ మిగలరు.

June 1, 2007

నియోజకాల పునర్విభజన - గందరగోళం

పునర్విభజనవల్ల నేనొక నియోజకవర్గంలోకీ, నా ఓటు మరో
నియోజకవర్గంలోకీ, నా సీటు ఇంకో నియోజకవర్గంలోకీ వెళ్లిందయ్యా.