October 31, 2007

కలెక్టర్ల సమావేసంలో కునుకు తీసిన మంత్రులు

మీటింగులకోసం ప్రత్యేకంగా చేసిన కుర్చీసార్‌. కునుకు
పట్టగానే నెమ్మదిగా వెనక్కు వాలుతుంది.

October 30, 2007

దొంగతనం చేసిన డీఎస్పీ

డీఎస్పీగారు వచ్చాక ఈయన సంగతి
చూద్దామంటారేంటి సార్‌, ఈయనే డీఎస్పీగారు

October 28, 2007

గేదెల పధకం

అది తెలుగుదేశం గేదె అయి ఉంటుందమ్మా,
పాలు తక్కువ ఇచ్చి మమ్మల్ని బద్‌నాం చేస్తోంది!

October 27, 2007

మొయిలీకి వెండి కిరీటం

నా పేరూ, వూరూ, నాకు కావాల్సిన పదవి
వగైరా అన్నీ కిరీటంపై చెక్కించా సార్‌!

October 26, 2007

నీటి ప్రాజెక్ట్‌‍ల తనిఖీలు

బాగోక కొట్టుకుపోయింది. దీని ప్లానూ, నిర్మాణం
బానే ఉంది కాని నదిలేని చోట కట్టారు..

October 25, 2007

UNPAలో జయలలిత

జయలలిత ఉన్నట్టు భావించటమే కాదు. ఆమెతో
కూటమి విషయాలు చర్చిస్తున్నాడు

October 24, 2007

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన

మద్దతు ధరతోపాటు, 'ఇందిరమ్మ' ఇళ్లలో
అక్రమాలు చూపెట్టినవారికి వెయ్యి చొప్పున
ఇవ్వటానికి కేంద్ర నిధులు అడగండి సార్‌

October 22, 2007

దసరా - గ్యాస్ కొరత, పెరిగిన ధరలు

ఎప్పుడూ పులివేషాలేనా అని ఈసారి
దసరా వేషాలు ఇలా వేశారు.

October 20, 2007

octopus

ఆయన మన ఆక్టోపస్‌ విభాగం డీజీపీగారు

October 19, 2007

బంపర్‌ తగ్గింపు

'బంపర్‌ తగ్గింపు, పండగ డిస్కౌంట్‌' అంటే ఏంటో అనుకున్నా,
బడ్జెట్‌ కేటాయింపులన్నీ భారీగా తగ్గించాడు

October 18, 2007

కిలో ఉల్లిపాయలు రూపాయికి అమ్మిన తెలుగుదేశం పార్టీ

రూపాయికే కిలో ఉల్లిగడ్డ అమ్మాంసార్‌, కాని
సరుకంతా కాంగ్రెస్‌ వాళ్లే కొనుక్కెళ్లారు


October 17, 2007

October 16, 2007

పగిలిన పైప్ లైన్‍లు

హలోసార్‌,... పగిలిన పైపులైన్‌పై మట్టికప్పేశాను
సార్‌, తనిఖీకి వచ్చిన అధికారులపై కూడా కప్పేసేదా?

October 15, 2007

కాంగ్రెస్‍లో ఇక యువతకు ప్రాధాన్యం

మేం యువకులుగా ఉన్నప్పుడు వృద్ధులకు ప్రాధాన్యం
ఇచ్చారు. మేం వృద్ధులయ్యాక యువకులకు
ప్రాధాన్యం అంటున్నారు. ఇది అన్యాయం

October 14, 2007

ఇఫ్తార్ విందులు

ఈసారి ఎక్కువ ఇఫ్తార్‌ విందులు తిన్న రికార్డు మీదే సార్‌!

October 13, 2007

ముఖ్యమంత్రికి దత్తాత్రేయ 74వ లేఖ

నా నోట్స్‌ పుస్తకాల్లో తెల్లకాయితాలన్నీ చించేసి
ఉంటే ఎవరో అనుకున్నా... నాన్నా, నువ్వేకదూ!...

October 12, 2007

దిగ్విజయ్‍తో మొయిలీ భేటీ


గుర్తుపెట్టుకో, ఇతనికీ ఈయనకీ చస్తే పడదు.
ఈ లీడరు ముఠాదారు. అతను చాడీలకోరు,
వీళ్లు అసమ్మతి, ఈయన అసమ్మతికి అసమ్మతి,
ఇతనిది కుట్ర స్వభావం, ఈమె....

October 11, 2007

ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమాలు

ఇవాళ మరోగ్రామంలో ఇందిరమ్మ
గృహప్రవేశ కార్యక్రమం ఉందట.

October 10, 2007

లాంతర్ పథకం

హైదరాబాద్‌లో కూడా లాంతర్‌ పథకం ప్రవేశపెట్టాలి సార్‌.
ఇక కరెంటు కోత మొదలవుతోంది.

October 9, 2007

ధోనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్

నిజం డియర్‌, మేం గెలిచాం, మొన్నీమధ్య 20,20లో
కూడా గెలిచామా లేదా. కావాలంటే టీవీ చూడు.

October 8, 2007

మూడో ఫ్రంట్‌

చిరంజీవీ, ధోనీ, అభిషేక్‌ బచ్చన్‌ లాంటివారు
వస్తే పెళ్ళిచేసుకుని మూడో ఫ్రంట్‌ కాపురం పెడతా,
లేకుంటే ఏం చేస్తాం, నిన్ను కట్టుకుంటా

October 6, 2007

ఎన్నికల హామీలు


మనకు ఓటువేస్తే టీం ఇండియాను
గెలిపిస్తామని హామీ ఇద్దాం సార్‌

October 5, 2007

వైయస్‍కు ధోనీ బ్యాటు బహుకరణ

చంద్రబాబు బాల్‌ కొనుక్కున్నాడట సార్

October 4, 2007

హామీలు

హామీల్లో మీ పేరు గిన్నీస్‌బుక్‌లో
వచ్చింది సార్‌. ఇదిగో సర్టిఫికెట్‌

October 3, 2007

టోపీ

రేషన్‌కార్డు అక్కర్లేదయ్యా, ఈ టోపీ చూపించు
చాలు, ఇల్లు అయినా, బియ్యం అయినా....

October 2, 2007

చంద్రబాబు ఎన్నికల హామీలు

అకస్మాత్తుగా మనం ప్రజాకర్షక
పథకాలు ఎక్కించేసరికి...