January 31, 2008

కర్నాటకలో రాహుల్ ప్రచారం

హుర్రే, యాహూ, కర్ణాటకలో గెలుపు మనదే...
రాహుల్‌ ప్రచారం చేసిన ప్రతిచోటా ప్రతిపక్షాలే గెలిచాయి...

January 30, 2008

అద్వానీ సంకల్ప యాత్ర

డ్రైవర్‌ అక్కర్లేదు సార్‌. మీరు యాత్రలు చేసిచేసి
రథానికి దారి సాంతం తెలిసిపోయింది

January 27, 2008

నేరగాళ్ళ బదిలీ ఒప్పందం

నేరగాళ్ల బదిలీ ఒప్పందంకింద నన్ను ఫ్రాన్స్‌
పంపించండి సార్‌. విదేశం చూసివస్తా...

January 26, 2008

కలహాల కాపురం -- కలకాలం ఆరోగ్యం

ఇదిగో, ఈ కాపురమే చక్కని ఉదాహరణ.

January 25, 2008

bird flu

కోళ్లు బానే ఉన్నాయి, మా రాష్ట్రంలో పార్టీకి బర్డ్‌ఫ్లూ వచ్చింది..

January 24, 2008

వై.ఎస్ ప్రభుత్వం పై విమర్శలు

షేర్‌మార్కెట్‌ కోలుకుంది కాని మనం ఇప్పట్లో కోలుకునేట్టు లేదు సార్‌

January 23, 2008

bill gatesలా ముందుకు రండి

వద్దు సార్‌, మళ్లీ బిల్‌గేట్స్‌ పేరెత్తకండి.
బిల్‌గేట్స్‌, బిల్‌క్లింటన్‌ల స్మరణే కొంపముంచింది.January 22, 2008

షేర్ మార్కెట్ పతనం

బంగారం కొనమంటే వినకుండా షేర్లలో పెడితివి.

January 21, 2008

ఖైదీల విముక్తికి రాజకీయ నాయకుల పైరవీలు

నేరుగా వదిలేయటానికి కోర్టు స్టే ఉంది. ఎలాగైనా
ఖైదీల్ని విముక్తం చేయటానికి ప్రయత్నిస్తున్నాడు.

January 19, 2008

అగ్నిమాపకదళం

అన్నిరకాల విపత్తుల్నీ ఎదుర్కోవాలంటే సాధ్యంకాదు సార్‌..
కొన్నింటినే ఎదుర్కోగలం, అసమ్మతినీ, తెలంగాణ ఎమ్మెల్యేలనీ,
అవినీతి ఆరోపణల్నీ ఎదుర్కోలేం, వాటి సంగతి మీరే చూడాలి

January 18, 2008

హరిరామ జోగయ్య వ్యాఖ్యలు

పార్టీవారెవరూ తెలంగాణ మీద మాట్లాడవద్దంటే
అప్పటినుంచీ మీమీద మాట్లాడుతున్నాడు సార్‌.

January 15, 2008

సంక్రాంతి సంబరాలు

కొత్తబట్టలు మనింటికి పంపించా,
పొంగలి అస్మదీయులకు పంచా,
భోగిమంటలు పెట్టా,
అధికార్లకు తలంటిపోయించా,
కాంట్రాక్టర్లకు గాలిపటాలిచ్చా,
రైతులకు గొబ్బెమ్మలు పంపా,
ప్రజలకు శుభాకాంక్షలు తెలిపా... అంతేనా సార్‌!

January 13, 2008

January 12, 2008

భారీ గాలిపటం

అంత భారీ గాలిపటాన్ని ఎగరేయవద్దు డియర్‌ అంటే వినకపోతివి

January 11, 2008

లక్ష కారు

లక్షకారుని మనం పేదలకి ఉచితంగా ఇస్తామని ప్రకటిద్దాం సార్‌!

January 10, 2008

పైపులైన్‍కు లీకు

హైదరాబాద్‌కన్న ముందు కృష్ణ నీటిని మనకు తరలించారు

January 9, 2008

బస్సులకు, రైళ్ళకు పండగ రద్దీ

అమెరికాలో ఉన్న అమ్మాయి వచ్చేసింది. హైదరాబాద్‌లో ఉన్న
అబ్బాయి రావటమే కష్టంగా ఉంది. బస్సులు దొరకట్లా.

January 8, 2008

January 7, 2008

ఉచిత సంక్రాంతి పధకం

ఉచిత సంక్రాంతి ముగ్గు పథకమట ఇంటింటికీ ముగ్గుపెట్టి వెళ్తున్నాడు

January 6, 2008

January 5, 2008

నియోజక వర్గాల పునర్విభజన

పునర్విభజనలో నా నియోజకవర్గం ఉందికాని నా
నియోజకవర్గంలో నేను లేను సార్‌..

January 4, 2008

పెరిగిన బంగారం ధర

ఈమధ్య మా సారు డబ్బు తీసుకోవట్లా. షేర్లయినా
ఆయనపేరున బదలాయించాలి. లేదా కాసుల పేరయినా పట్టుకురావాలి...

January 3, 2008

అక్రమ కట్టడాలు

క్రమబద్ధీకరణ చేయటానికే అక్రమ కట్టడాల్ని కట్టనిచ్చామయ్యా...

January 2, 2008

ఆదర్శరైతు

కష్టపడి వ్యవసాయం చేసేవాడిని రైతు అంటారు.
అవేమీ చేయకుండా తిరిగేవాణ్ణి ఆదర్శరైతు అంటారు తెలిసిందా

January 1, 2008

నూతన సంవత్సరం - మద్యం అమ్మకాలు

రికార్డు ష్టాయిళో మడ్యం అమ్మకాళు జరిగాయి
షార్‌. అంటా మష్టుగా టాగి పడుకుణ్నారు