July 15, 2008

నేరగాళ్లను గుర్తించే పరికరం

నోరు విప్పకపోయినా నేరగాణ్ని గుర్తించే

పరికరాన్ని ఇక్కడెవరయ్యా పెట్టారు? సారు

వస్తోంటే వెళ్తోంటే బయ్య్‌ బయ్య్‌ మంటోంది!

July 13, 2008

దారిమళ్లిన బియ్యం

దారిమళ్లిన బియ్యంలో మీ వాటా సార్‌, ఎక్కడదింపేది?

July 12, 2008

రహస్యం


మేఘ మథనం

మేఘ మథనంవల్ల కురవదని ఎవరన్నారు.
అదిగో చూడు కుంభవృష్టి.

July 11, 2008

రికార్డు స్థాయిలో ఆహారోత్పత్తి

ఆహారంపై పాఠం చెబుతోంటే' ఆకలేస్తోందం 'టావేం, కూర్చో!...
మనదేశం ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించెను,
ఈ ఏడాది రి కార్డుస్థాయిలో పంటలు పండినవి... రాసుకో!



July 10, 2008

అణు ఒప్పందం

అణుఒప్పందం ధరల్ని తగ్గిస్తుందని చెబుదాం సార్‌, అంతా మనల్నే సమర్థిస్తారు

July 9, 2008

నిషిద్ధ సంస్థలకు టెండర్లు

నీది నిషిద్ధ సంస్థనా? ఇంకానయం, నాకు సంస్థే లేదు.
అయినా టెండర్లు ఇచ్చారు.

July 8, 2008

కాశ్మీర్‍లో కాంగ్రెస్ సర్కార్ పతనం

ఇంకా మనకు ఏయే రాష్ట్రాలు మిగిలిఉన్నాయని చూస్తున్నా మేడం.

July 7, 2008

గ్రే హౌండ్స్ బలోపేతం

గ్రేహౌండ్స్‌ని బలోపేతం చేస్తానని మంత్రిగారంటే ఏంటో అనుకున్నా అందరికీ ఈత

July 6, 2008

వానలు

వానలు కురిపించాలని నన్ను అడుగుతారేంటయ్యా,
నాకూ వానలకీ ఏంటి సంబంధం

July 5, 2008

ధరల పెరుగుదల

వద్దు వద్దు. శుభలేఖలో భోజనతాంబూలాలని రాయకండి.
తాంబూలం మాత్రమే స్వీకరించి అని రాయండి.

July 3, 2008

అమెరికా విశ్వవిద్యాలయంలో తెలుగు

మన బళ్లలో కూడా తెలుగు పెట్టాలి సార్‌.

July 2, 2008

జోలె పట్టి అయినా పధకాలు పూర్తి చేస్తాం

జోలెలో అంతా చద్దన్నం, పప్పూ, రొట్టెముక్కలూ వేస్తున్నారు.
ప్రాజెక్టులకు డబ్బులెవరూ వేయట్లా.

July 1, 2008

"మీకోసం" వంద రోజులే

ఇక మీకోసం ముగించి తనకోసం చూసుకోకపోతే ప్రమాదమట...