April 30, 2007

UPలో కాంగ్రెస్ బలం

ఇక్కడ ములాయం పార్టీకి గట్టి పోటీనిస్తాం.
ఈ స్థానంలో మన అభ్యర్థికి డిపాజిట్‌ తిరిగివస్తుంది.
ఇటంతా మూడోస్థానం మనదే... ఇక్కడ...

April 29, 2007

కుక్కల కుటుంబ నియంత్రణ

ఇప్పటి వరకు 90 కుక్కలకు కుటుంబ
నియంత్రణ ఆపరేషన్లు చేశాం సార్‌.
ఈలోపున తొమ్మిదివేల కుక్కలు
ఈని పిల్లలు పెట్టాయి.

April 28, 2007

వైద్య శాఖ విభజన

వైద్యశాఖ విభజనవల్ల డాక్టర్లంతా ఒకశాఖకీ,
నర్సులు మరోశాఖకీ,
రోగులు ఇంకోశాఖలోకీ వెళ్లారు సార్‌.

April 27, 2007

హైదరాబాదు - భారత దేశం నేరాల రాజధాని

అలా నేరుగావెళ్లు,
హైదరాబాద్‌ వస్తుంది.

April 26, 2007

అసమ్మతి నేత ప్రమాణ స్వీకారం

అసమ్మతి నేత సార్‌!

April 25, 2007

ఆసుపత్రులు - లోకాయుక్త


ఎంతమాట, మీరు చెప్పేదాకా ఆగుతామా సార్‌,
ఆసుపత్రుల్ని పందులకు ఏనాడో వదిలేశాం

April 24, 2007

MPల అక్రమ రవాణా కుంభకోణం


ముందు మీరు వెళ్లండి డియర్‌,
నేను వెనకాల వస్తా,
మీతోవస్తే మీరు తరలిస్తున్న
స్త్రీగా నన్నంతా భావిస్తారు

April 23, 2007

అప్పులు

ఇక బట్టలుతికితే పన్ను,
పిడకలు చేస్తే పన్ను,
కసువు తీస్తే పన్ను...
ప్రపంచబ్యాంకు మరింత అప్పు ఇస్తోంది మరి.

April 22, 2007

సాగు నీటి మీటర్లు

వాన నీటి మీటరు సార్‌. వర్షాధార పంటలకు బిగించటానికి.



April 21, 2007

విదేశీ మారక ద్రవ్య నిలువలు


రూపాయి లేకున్నామానె, ఒక డాలరైనా
ధర్మం చేయండి సార్‌

April 20, 2007

April 19, 2007

మంత్రిగారి సంతకం

ముఖ్యమైన ఫైలు తెస్తున్నా, కళ్లుమూసుకోండి సార్‌.
సంతకం పెట్టాలి!

April 18, 2007

గ్రేటర్ హైదరాబాద్

గ్రేటర్‌ అంటే మరేమీ లేదు. నగరం సమస్యలు శివారు
ప్రాంతాలకూ, శివారు ఇబ్బందులు నగరానికీ

April 16, 2007

మంత్రివర్గ విస్తరణ


రాష్ట్ర ప్రభుత్వానికి మూడేళ్లు నిండాక, యూపీ ఎన్నికలయ్యాక మేలో
మంత్రివర్గాన్ని విస్తరిస్తానన్నాడు కాని అప్పటికి మూఢాలు వస్తున్నాయి.

April 15, 2007

డిపెప్ కుంభకోణం - ప్రభుత్వ చర్యలు

కోట్లరూపాయల కుంభకోణం జరిగితే చూస్తూ
వూరుకుంటాననుకున్నారా, చాయ్‌ ఇచ్చే ఆ కుర్రాణ్ని
సస్పెండ్‌ చేయండి.వూడుస్తున్న ముసలావిడను తొలగించండి.

April 14, 2007

MLA quarters ఖాళీ చేయని మంత్రులు

కరెంటూ నీళ్లూ ఆపేస్తే లాభంలేదు సార్‌.
డ్రైనేజీ ఆపేయాలి... ఖాళీ చేస్తారు

April 13, 2007

మంత్రివర్గ విస్తరణ


సరసాదేవికి మంత్రిపదవి ఇప్పిస్తానని వాగ్దానం చేశాను సార్‌. ప్లీజ్‌

April 12, 2007

మహారాష్ట్ర పోలిసులు లాఠీచార్జ్

బాబ్లీపై ఆంధ్రప్రదేశ్‌లో ధర్నాలూ, బంద్‌లూ నిర్వహిస్తున్నారు.
వారిపై లాఠీఛార్జ్‌ చేయటానికి పంపిస్తున్నా

April 11, 2007

ఎన్నికలకు సిద్ధంకండి - ముఖ్యమంత్రి సూచన

ఎన్నికలకు నేను సిద్ధం సార్‌, పదిహేనుకోట్లు సంపాదించా

April 10, 2007

మంత్రివర్గ విస్తరణ

మంత్రిపదవి లేకున్నామానె, సూరీడు
పదవి తమకివ్వమంటున్నారు సార్‌.

April 8, 2007

IAS officerల బదిలీలు

ఈయన్ని ఇక్కడికి బదిలీ చేశారు కాని ఇక్కడినుంచి
నన్ను బదిలీ చేయటం మరిచిపోయారు సార్‌!

April 7, 2007

UPఎన్నికలలో ప్రచారానికి చంద్రబాబు

హిందీ బాగా వచ్చింది, ఈ లోపున తెలుగు పూర్తిగా

April 6, 2007

సమాజ్‍వాదీ పార్టీ ప్రచారంలో ప్రముఖులు


ఓటర్ల లిస్టు కాదు సార్‌, మన పార్టీ తరఫున
ప్రచారం చేస్తున్న వారి జాబితా

April 5, 2007

బంద్‍లు సెలవులు

మాకుకూడా వేసవి సెలవులు వచ్చాయి డియర్‌.
నిన్న బంద్‌, ఇవాళ జగ్జీవన్‌రాం జయంతి, సెలవు.
రేపు గుడ్‌ఫ్రైడే ఆతరువాత శని ఆదివారాలు

April 4, 2007

Approverగా మారుతానన్న మొద్దు శీను


రవి హత్యకేసులో నిందితులందరూ అప్రూవర్లుగా
మారుతారట సార్‌, వదిలేయమంటున్నారు

April 3, 2007

మూడు ముక్కలైన వైద్య శాఖ

వైద్యశాఖ విభజనవల్ల డాక్టర్లంతా ఒకశాఖకీ,
నర్సులు మరోశాఖకీ, రోగులు
ఇంకోశాఖలోకీ వెళ్లారు సార్‌

April 2, 2007

ఊర కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

అది బ్రహ్మచారి కుక్కట సార్‌,
దీనికింకా పెళ్లికాలేదు,
దానికింకా సంతానం కలుగలేదట,
ఈ కుక్కవాళ్లాయన ముందే ఆపరేషన్‌

April 1, 2007