August 31, 2007

అణు ఒప్పందం అమలు నిలిపివేత

హమ్మయ్య, అణు ఒప్పందాన్ని తాత్కాలికంగా
నిలిపివేశారు. అమలు చేస్తారేమో, మద్దతు
ఉపసంహరించాలేమో అని తెగ భయపడ్డా కామ్రేడ్‌!

August 30, 2007

కోనేరు కమిటీ రిపోర్టు

కోనేరు కమిటీ రిపోర్టు అమలుకి అంతా
సిద్ధం సార్‌, జీవో విడుదల చేయవచ్చు.

August 29, 2007

సచివాలయానికి బాంబు బెదిరింపు

బాంబుకోసం వెదికితే మంత్రిగారు దొరికారు సార్‌

August 28, 2007

రాజకీయ నాయకుల పరామర్శల పరాకాష్ఠ

నాయకులందరూ పరామర్శించి వెళ్లారు డాక్టర్‌.
ఇక బాధితులకు వైద్యం ఆరంభించమంటారా...
సందర్భం:
లుంభిని పార్కు, గోకుల్ చాట్ పేలుళ్ళ బాధితులను పరామర్శిస్తున్న రాజకీయ నాయకులు.

August 27, 2007

బాలీవుడ్ నటులు - జైలు శిక్షలు

సంజయ్‌దత్‌ వెళ్లిపోతే మాత్రం...?,
సల్మాన్‌ఖాన్‌ వస్తాడుగా, బాధపడకు...

August 25, 2007

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల

నెల సామాను తీసుకెళ్తున్నాడు.

August 22, 2007

ఇందిరమ్మ ఇళ్లకు పార్టీ రంగు

ఇందిరమ్మఇళ్లకు పార్టీరంగుతోపాటు
లబ్ధిదార్లకు వాతలు కూడా పెడదాంసార్‌ గుర్తుగా.

August 21, 2007

ఓట్ల లెక్కలు

కాంట్రాక్టర్ల ఓట్లూ, ఫ్యాక్షనిస్టుల ఓట్లూ,
డెంగీదోమల ఓట్లు మరచిపోయారు సార్‌.

August 20, 2007

పేదరికం

సెన్సెక్సూ, అభివృద్ధీ పడుతూ లేస్తూ ఉంటాయి.
పేదరికం ఒక్కటే స్థిరంగా అభివృద్ధి చెందుతుంది...

August 19, 2007

ప్రభుత్వానికి వామ పక్షాల మద్దత్తు

ప్రభుత్వం పడిపోతే బీజేపీకి లాభం, ప్రభుత్వాన్ని
కొనసాగనిస్తే మనకు నష్టం, ఎట్లా చచ్చేది కామ్రేడ్‌!

August 18, 2007

క్షమాభిక్ష

ఇకపైన జైళ్లకెళ్లక ముందే క్షమాభిక్ష పెడదాం సార్‌.

August 17, 2007

రాజీవ్‌విపక్ష నిరసన పథకం

కాలనీ పేరుతోపాటు మన పార్టీ నిరసన పేరుని కూడా
మార్చాడు సార్‌. మనది 'రాజీవ్‌విపక్ష నిరసన పథకమ'ట.

August 16, 2007

ప్రధానమంత్రి స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగం

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని యువతని కోరాడు,
నదీజల సమస్యల్ని పరిష్కరించుకోవాలని రాష్ట్రాలని కోరాడు,
సత్సంబంధాల్ని నెలకొల్పాలని ఇరుగుపొరుగు దేశాల్ని కోరాడు,
ఉద్యోగాల్ని కల్పించాలని ప్రైవేటుని అడిగాడు...

August 14, 2007

అణు ఒప్పందం

న్యూక్లియర్‌ పాఠం కూడా న్యూక్లియర్‌ ఒప్పందం లాంటిదే,
చెప్పేవాళ్లకి కూడా అంత సులభంగా అర్థం కాదు

August 12, 2007

ఓబుళాపురానికి అఖిలపక్షం

గనిలో దారి తెలియనివాడిని
అఖిలపక్షానికి గైడ్‌గా పంపాను సార్‌!

August 11, 2007

క్షమాభిక్ష

క్షమాభిక్ష నిబంధనల మేరకు నాకు ఇవాల్టికే
విముక్తి కలగాలి సార్‌, వెళ్లిపోదామని...

August 10, 2007

ఉపరాష్ట్రపతి ఎన్నిక

ఇదిగో ఎన్డీఏ అభ్యర్థిగా నజ్మాకి మేం ఓటేయట్లేదు.
మహారాష్ట్ర ఆడపడుచని వేస్తున్నామంతే!

August 9, 2007

జలయజ్ఞంలో అవినీతి

అంత డబ్బుని భద్రంగా దాచటానికి కావద్దూ...
పెద్ద ఇనప్పెట్టె తెప్పించా డియర్‌

August 8, 2007

జనంలోకి వెళ్దాం

మనమిప్పుడు జనంలో లేమా సార్‌?

August 6, 2007

ఢిల్లీలో క్యాంటీన్‌ కాంట్రాక్టర్‌ ఆస్తులు

మన సిబ్బంది దాడులు చేయలేనన్ని
ఇళ్లూ, ఫ్లాట్లూ ఉన్నాయి సార్‌ ఆయనకు
సందర్భం
పేరు- అశోక్‌ మల్హోత్రా..
వృత్తి- ఢిల్లీ విధాన సభలోను, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోను క్యాంటిన్‌ నడపటం..
పదేళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో 'చోలే'(శనగలతో చేసిన వంటకం)ను విక్రయించిన అశోక్‌ ఆటోను కూడా నడిపాడు.. అందుకే తన పాత జీవితాన్ని మర్చిపోవటం ఆయనకు ఇష్టం లేదు.. అందుకే తన ఇంటి ముందు ఆ 'త్రిచక్ర వాహనాన్ని' జాగ్రత్తగా ఉంచాడు.. అది ఇంటికి వచ్చి పోయే వారికి అతని తొలి జీవితం గురించి చెప్తుంది..
అశోక్‌కు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అనుమానంతో సీబీఐ అధికారులు గురువారం ఆయన ఇళ్లపై దాడులు చేశారు. 52 లగ్జరీ కార్లు.. 5500 ప్లాట్లకు సంబంధించిన పత్రాలు.. ఢిల్లీలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఇళ్లు.. లాకర్లలో బంగారు ఆభరణాలు.. దేశ, విదేశీ బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు డిపాజిట్లు.. దొరికాయి.

August 5, 2007

Friendship Day

హాపీ ఫ్రెండ్‌షిప్‌ డే కామ్రేడ్‌!

August 4, 2007

స్నేహపూర్వక పోరాటం


మనది స్నేహపూర్వక పోరాటమట, ఆయనది
స్నేహపూర్వక కాల్పులట కామ్రేడ్‌

August 3, 2007

ప్రభుత్వం సాంస్కృతిక బృందాలతో ప్రచారం

సాంస్కృతిక బృందాలు సక్రమంగా పనిచేస్తాయోలేదోనని
మంత్రులే అలా తయారయ్యారు.

August 2, 2007

ముఖ్యమంత్రి బహిరంగ లేఖ

ప్రజలకు బహిరంగలేఖ ఎందుకు రాశారుసార్‌,
అంతా తిరిగి సమాధానాలు రాశారు.
సందర్భం:
ముదిగొండ కాల్పుల తరువాత ప్రతిపక్షాల ఆరోపణలకు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒక బహిరంగ లేఖ వ్రాశారు.

August 1, 2007

లంచం

మేం చితకొట్టటం వల్లే నీకు ఎక్స్‌గ్రేషియా
వచ్చింది. మర్యాదగా మా వాటా ఇవ్వు