మన సిబ్బంది దాడులు చేయలేనన్ని
ఇళ్లూ, ఫ్లాట్లూ ఉన్నాయి సార్ ఆయనకు
సందర్భం
పేరు- అశోక్ మల్హోత్రా..
వృత్తి- ఢిల్లీ విధాన సభలోను, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోను క్యాంటిన్ నడపటం..
పదేళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో 'చోలే'(శనగలతో చేసిన వంటకం)ను విక్రయించిన అశోక్ ఆటోను కూడా నడిపాడు.. అందుకే తన పాత జీవితాన్ని మర్చిపోవటం ఆయనకు ఇష్టం లేదు.. అందుకే తన ఇంటి ముందు ఆ 'త్రిచక్ర వాహనాన్ని' జాగ్రత్తగా ఉంచాడు.. అది ఇంటికి వచ్చి పోయే వారికి అతని తొలి జీవితం గురించి చెప్తుంది..
అశోక్‌కు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అనుమానంతో సీబీఐ అధికారులు గురువారం ఆయన ఇళ్లపై దాడులు చేశారు. 52 లగ్జరీ కార్లు.. 5500 ప్లాట్లకు సంబంధించిన పత్రాలు.. ఢిల్లీలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఇళ్లు.. లాకర్లలో బంగారు ఆభరణాలు.. దేశ, విదేశీ బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు డిపాజిట్లు.. దొరికాయి.