July 31, 2007

ఖమ్మం పోలీసులు

హలో, ఖమ్మం పోలీసుల్ని పంపించేదా?

July 30, 2007

MLA రొయ్యల అక్రమ పెంపకం - వాటి పై ప్రభుత్వ నివేదికలు


ఏం చేసేది సార్‌, అక్రమాల గురించి అడగటానికి
వెళ్లిన ప్రతిసారీ రొయ్యల పులుసు పోస్తున్నాడు.

July 29, 2007

ముఖ్యమంత్రి CD

అయ్యా, ఇదిగో సీడీలు చూడండి!
మొన్న దేశంవాళ్లు పోలీసుల్ని పిడిగుద్దులు గుద్దారు,
ఇవాళ లెఫ్ట్‌ కార్యకర్తలు వెళ్లి తుపాకీగుళ్లకు తాకారు!
సందర్భం:
ముఖ్యమంత్రిగారు జరిగిన అవాంచనీయ సంఘటనలు గురించి అసెంబ్లీలో వివరణ ఇవ్వటానికి CDలు ఉపయోగించారు. అదే విధంగా సామాన్యుడికి కూడా జరిగిన అరాచకాల గురించి వివరణ ఇస్తున్నట్లుగా గీసిన cartoon ఇది.

July 28, 2007

అస్సెంబ్లీ వర్షాకాల సమావేశాలు సమాప్తం


వచ్చే సమావేశాల్లో మీరొక్కరే కాదు.
బాబుని తిట్టే అవకాశం మనవాళ్లందరికీ ఇవ్వాలి.
ఈసారి చాలా నిరాశ చెందాం

July 27, 2007

కలాం ఉపాద్యాయ వృత్తి

యూనివర్సిటీలోని పెద్దపిల్లలు ఎలాగైనా నేర్చుకుంటారు.
మీరు వచ్చి మాకు చెప్పండి సార్‌. టీచర్లు లేరు.
సందర్భం:
అబ్దుల్ కలాం తమ రాష్ట్రపతి పదివి తరువాత అన్నా universityలో professorగా చేరారు.

July 26, 2007

మిగిలని తిట్లు

నేను ఇవాళ సభలో తిట్టాలనుకున్న తిట్లన్నీ
నిన్ననే నువ్వు తిట్టివస్తే ఎలా, నేనేం తిట్టాలి?
ముందు నన్ను సంప్రదించాల్సింది
సందర్భం:
OMC(ఓబుళాపురం మైనింగ్ కంపెనీ) అధ్యక్షులు గాలి జనార్ధనరెడ్డి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి అన్న వ్యాఖ్యల మీద ముఖ్యమంత్రి గారి చర్చ.

July 25, 2007

ముఖ్యమంత్రిగారి ఎవరిని కడుగుతారో??

మొన్న ప్రతిపక్షాల్ని,
నిన్న పత్రికల్నీ,
ఇవాళ ఎవర్ని సార్‌?

July 24, 2007

assemblyలో ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు

వాకౌట్‌ కాదయ్యా, ఆ తిట్లు
వినలేక పారిపోతున్నాం
సందర్భం:
ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి assemblyలో, "కడిగేస్తాను. నిన్ను కడిగేస్తాను. నువ్వు నీ తల్లికి ఎందుకు పుట్టావో అని సిగ్గుపడుతావు......." అని అన్నారు.

July 23, 2007

మూడో ఫ్రంట్‍లో జయలలిత

జయ మనతోనే ఉన్నారు. మన వెంట
తీసుకెళ్లటానికి దీన్ని పంపించారు.

July 22, 2007

assemblyలో కూరగాయల అమ్మకం

మొత్తం సరుకు కాంగ్రెస్‌వాళ్లు కొనుక్కెళ్లి
మారుబేరానికి అమ్ముకుంటున్నారు సార్‌!
సందర్భం:
కూరగాయల ధరలు ఎక్కువయ్యాయని, వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని, తెలుగు దేశం పార్టీ assembly సమావేశాలలో కూరగాయలు అమ్మై తమ నిరసన్ వ్యక్తం చేసింది.

July 21, 2007

రాష్ట్రపతి ఎన్నికలలో AIADMK వోట్లు

మీవాళ్లు తెలియక వేసిన ఓట్లని చెల్లని
ఓట్లుగా పరిగణించమంటారా మేడం?
సందర్భం:
UNPA (United National Progressive Alliance) కూటమి రాష్ట్రప్రతి ఎన్నకలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. కానీ AIADMK సభ్యులు మటుకు వెళ్ళి వోట్లు వేశారు. ఆ పార్టీ అధినేత జయలలిత, మావాళ్ళు తెలియకుండా వోట్లు వేశారని చెప్పారు!!!!

July 20, 2007

ఉరి శిక్ష

ఉరిశిక్ష వేస్తారంతే,
ఉరి తియ్యరు నువ్వేం భయపడకు.
సందర్భం:
బొంబాయి పేలుళ్ళ కేసులో కోర్టు మరో ముగ్గురికి ఉరి శిక్ష విధించింది. 2002 parliament పై దాడి కేసులో అఫ్జల్ గురుకి ఉరి శిక్ష పడింది ( October 20,2006న ఉరి తీయవలసి ఉన్నది). కానీ రాష్ట్రపతికి క్షమాభిక్షకు అర్జీ పెట్టుకున్నడు. రాష్ట్రపతి నుండి ఎటువంటి సమాధానం లేనందువలన ఇంతవరకు ఉరి తీయలేదు.

July 19, 2007

రాష్ట్రపతి ఎన్నికలు - వోటింగ్‍లో పాల్గొనకపోవడం

మనం ఓటింగ్‌కి దూరంగా ఉంటే మన ఓట్లు
వాళ్లు వేశేసుకుంటారేమో సార్‌, నాకు భయంగా ఉంది.

July 18, 2007

కూరగాయలు, మాంసం ధరలు

పద డియర్‌ ఎక్కడైనా పారిపోదాం;
ఇక్కడ ఉంటే ఇంతే సంగతి!

July 17, 2007

పి. జనార్ధన్ రెడ్డి నిరాహార దీక్ష విరమణ


ఎంత బతిమిలాడినా ససేమిరా అన్నాడు.
చివరకు ఘుమఘుమలాడే చేపల పులుసు తెప్పించా,
అంతే, దిగివచ్చి దీక్ష మానుకున్నాడు.

July 16, 2007

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

నువ్వు ఎదురుదాడి చెయ్యి,
నువ్వు పక్కదారి పట్టించు,
నేను సస్పెండు చేయమని సిఫార్సు చేస్తా,
నువ్వు ఎవర్నీ మాట్లాడనివ్వకు...
సందర్భం:
ఈ రోజు నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలు. పార్టీలు ఏ ఏ విధంగా అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తారో/చేయవచ్చో, ఈ కార్టూన్ ద్వారా చక్కగా చూపించారు.

July 15, 2007

నిరాహారదీక్ష

ఆయన నిరాహారదీక్షకు వ్యతిరేకంగానట.
ఈయన తిండిదీక్ష ఆరంభించారు.
సందర్భం :
ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తమ్ముడు, పి. జనార్ధన్ రెడ్డి గార్ల మధ్య జరిగిన ఘర్షణ ,దాని తరువాత జరిగిన పరిణామాల దృష్ట్యా, పి. జనార్ధన్ రెడ్డి తమకు అన్యాయం జరిగిందని, నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.

July 14, 2007

హైదరాబాదులో speed guns

స్పీడ్‌గన్‌కు డబ్బులు దండగ సార్‌.
ఈ ట్రాఫిక్‌లో వేగంగా ఎవరు వెళ్లగలరు?

July 13, 2007

భారత దేశ జనాభా - రోగాలు, ఆత్మహత్యలు


రైతుల ఆత్మహత్యలూ, వలసలూ, ఆడశిశువుల
హత్యలూ, గన్యా మృతులూ లెక్కేశావాసారూ,
(నాకు డౌటే)

July 11, 2007

రాష్ట్రపతి పదివి ఎన్నికలు

సందర్భం : UNPA (United National Progressive Alliance) - చంద్రబాబు, జయలలిత, ములాయమ్ సింగ్ మొదలగువారు ఏర్పాటు చేసిన కూటమి రాష్ట్రపతి పదివికి పోటీ చేస్తున్న ప్రతిభా పాటిల్‍, బైరవ్ సింగ్ షెకావత్ లు ఇద్దరికీ ఓటు వేయ్మని తీర్మానించారు.
మనమేమో ఓట్లేసి వాళ్లని గెలిపించాలి,
వాళ్లేమో ఓటు వేయరట, ఇంట్లో కూర్చుంటారట.

July 10, 2007

రాజ ద్రోహం - ప్రజా ద్రోహం

సందర్భం:
కాంగ్రెస్ పాలన్లో ఎన్నో అవినీతులు చోటు చేసుకున్నా, ఎవరి మీద కేసులు లేవు. ప్రజాధనాన్ని కొల్లగొట్టుతున్న వారిని ఏమీ చేయని ప్రభుత్వం నారాయణ మీద కేసు పెట్టి జైలు పాలు చెయ్యడంపై వేసిన కార్టూన్.



ప్రజాద్రోహానికి కేసులుండవు, రాజద్రోహానికి
పాల్పడితేనే జైలుకెళ్లాలి. తెలిసిందా కామ్రేడ్‌!

July 9, 2007

Congress, BJP రాష్త్రపతి అభ్యర్ధులపై బురద జల్లుకోవటం

రాష్ట్రపతి అభ్యర్థుల్ని విమర్శించటానికి ఇంకా చారిత్రక
ఆధారాలేమైనా దొరుకుతాయేమోనని తవ్వకాలు జరుపుతున్నారు

July 8, 2007

లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే జైలుకే


నాకు లైసెన్స్‌ ఉందికాని నడపటం రాదుసార్‌, వాడికి వచ్చుకాని లైసెన్స్‌ లేదు

July 7, 2007

పెరిగిన రూపాయి విలువ


విదేశాల్లో రూపాయి విలువ పెరిగింది,
స్వదేశంలో టమాటా, ఉల్లిపాయల విలువ పెరుగుతోంది

July 6, 2007

విదేశీ మద్యం ధర


నిత్యావషరాలు మనకు అందుబాటులో
లేవు డియర్‌. దీనిఢర మాత్రమే టగ్గిండి

July 5, 2007

MLAలకు పాఠాలు

మేనేజ్‌మెంటు విద్యార్థులు అలాగయ్యారు.

July 4, 2007

ఉపసంహరణ


విత్‌డ్రాయల్‌ కోసం నువ్వెందుకయ్యా
ఎదురుచూస్తున్నావు. మిగిలింది
ఇద్దరేనాయె, లాభంలేదు. మరో పనిచూడు.

July 3, 2007

కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్ధి


చాలా గాలించాం తెలుసుగా,
అంతకన్న మంచి అభ్యర్థి పార్టీలో లేరు.
మరేం చేస్తాం...

July 2, 2007

డెంగీ జ్వరాలు

డెంగీ జ్వరాలు హైదరాబాద్‌కి కూడా
వచ్చాయని ఇవాళ పేపర్‌లో చదివాడు.