September 30, 2007

అవినీతి బియ్యం

ప్రాజెక్టుల్లో నేను ఏనాడూ వాటా అడగలేదు.
బియ్యం వ్యవహారాలు నాకే అప్పజెప్పాలి.

September 29, 2007

రాజకీయ పార్టీల ఎన్నికల హామీలు

వండివారుస్తామనీ, కూరగాయలు తరిగి పెడతామనీ,
చింతకాయపచ్చడీ, వూరగాయలూ పెడతామనీ
మనం వాగ్దానం చేద్దాం సార్‌!

September 27, 2007

నెల్లూరు దేశంలో ముఠాపోరు

పల్లెబాట నెల్లూరు పైనుంచి వెళ్దాం సార్‌!

September 26, 2007

కాంగ్రెస్‍కు దీటుగా మన పార్టీలో కూడా యువరక్తం
ఎక్కిద్దామంటే కుదరట్లా. మన పిల్లలు కూడా
యువకులు కాదు. వయసు దాటింది.

September 25, 2007

వినాయక నిమజ్జనం



ఈ సందర్భంలో వినాయాక చవితికి వచ్చిన కార్టూన్ ఈ క్రింది లంకెలో చూడవచ్చు:
http://telugu-cartoons.blogspot.com/2007/09/blog-post_4218.html

September 23, 2007

ఎంత ప్రయత్నించినా తను అమాయకుడినని
ఒప్పుకోవట్లేదు సార్‌, హత్య చేశాననే అంటున్నాడు ఏం చేసేది
సందర్భం:
రియల్టరు ప్రశాంత్‌ రెడ్డి హత్య కేసు కొత్తమలుపు తిరిగింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు కేశవరావు తనయుడు వెంకట్‌ ప్రధాన నిందితుడైన ఈ కేసులో... సీఐడీ ఉన్నట్టుండి బాంబు పేల్చింది. ప్రశాంత్‌రెడ్డిని తానే కాల్చి చంపినట్లు తమ ఇంటరాగేషన్లో వెంకట్‌ అంగీకరించాడని స్పష్టంచేసింది. ఈ మేరకు వెంకట్‌ ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేశామని చెబుతూ... సీఐడీ పోలీసులు దాన్ని కోర్టుకు సమర్పించారు. ఈ ప్రతి మీడియాకు చిక్కటంతో అందులోని వివరాలు బయటపడ్డాయి.
మొదటి నుంచీ వెంకట్‌ తాను ప్రశాంత్‌రెడ్డిని హత్య చేయలేదని చెబుతూ వచ్చారు. ఫోరెన్సిక్‌ నివేదికలోనూ ప్రశాంతే ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు. గన్‌ పౌడర్‌ ప్రశాంత్‌రెడ్డి భుజంపై పడిందని పేర్కొన్నారు కూడా. సీఐడీ కోర్టుకు అందజేసిన వెంకటరావు వాంగ్మూలంలో మాత్రం దీనికి భిన్నమైన వివరాలున్నాయి. ఈ నెల 18న మాసబ్‌ట్యాంక్‌ దగ్గరి తమ కార్యాలయంలో వెంకట్‌ నుంచి వాంగ్మూలం తీసుకున్నామని, అక్కడొక కంప్యూటర్‌ ఆపరేటర్‌ మాత్రమే ఉన్నారని సీఐడీ ఆ నివేదికలో తెలిపింది.

September 22, 2007

కలెక్టర్లకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి

మీకిది ఇవ్వమని సీఎంగారు పంపారు సార్‌!
సందర్భం:
మరో ఏడాదిన్నరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే ప్రక్రియ మొదలైంది. గురువారం ఇందిరమ్మ కార్యక్రమంపై కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఈ మేరకు సంకేతాలిచ్చారు. ''ఏడాదిన్నరలో మేం పరీక్షలకు కూర్చుంటాం, మమ్మల్ని పాస్‌ చేయించేది మీరే'' అంటూ ఆయన పరోక్షంగా ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఇందిరమ్మ గృహ నిర్మాణంతోపాటు ఇతర పథకాలకు నిర్దేశించిన లక్ష్యాలను సత్వరమే సాధించాలని ఆదేశించారు. అధికారుల పనితీరే తమకు ప్రామాణికమని, వారంతా చక్కగా పనిచేస్తేనే తాము ప్రజాదరణ పొందుతామని వైఎస్‌ వ్యాఖ్యానించడం విశేషం. ''అందరు చక్కగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఎన్నికల్లో గెలవడం కోసమని కాదు. ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా అని చూడాలి'' అని సీఎం అన్నారు. కొందరు అధికారుల పనితీరు బాగా లేదని, దానివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

September 21, 2007

హోరువానలో మేఘమథనం

చూశారా, మేం మేఘమథనం చేయగానే
వాన ఆగిపోయింది, లేకుంటే మరిన్ని వరదలు వచ్చేవి.

సందర్భం:
బంగాళాఖాతంలో అల్పపీడనం... చురుగ్గా మారిన నైరుతి రుతుపవనాలు.. మూడు రోజులుగా ఎడతెరిపిలేని వానలు..ఈ హోరువానను చూడగానే జేఎన్‌టీయూ అధికారులకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెరైటీగా జోరు వానలోనే మేఘమథనం చేయాలనిబయలుదేరారు. రయ్యిమని విమానంలో వచ్చి, కడప జిల్లాలోని ఒక్క కొండాపురం మండలం మినహా మిగతా అన్ని మండలాల్లో మేఘమథనం చేశారు. ఇదేమీ చోద్యం..! సహజంగా వర్షాలు కురుస్తుంటే ఈ మేఘమథనం ఏంటీ? అని జిల్లా అధికారులు నోరెళ్లబెడుతున్నారు. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నుంచి కడప జిల్లాలో కూడా వానలు విస్తృతంగా పడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ ప్రొద్దుటూరు పర్యటన కూడా వాయిదా పడింది.అయినా, అదేరోజు జేఎన్‌టీయూ అధికారులు జిల్లాలో మేఘమథనం జరిపారు. ఆ తర్వాత ముఖ్య ప్రణాళిక అధికారి(సీపీవో) కార్యాలయానికి సమాచారం చేరవేశాయి. కార్యాలయ అధికారులు నమూనాలు తీసి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు పంపారు. ఆ నమూనాల ఆధారంగా ప్రస్తుతం కురిసిన వర్షం సహజమైందా? మేఘమథనం కారణంగా పడిందా అనేది నిర్ధరించాల్సి ఉంది. మరోవైపు సహజంగా వర్షాలు పడుతున్నా మేఘమథనం చేయడంలో ఆంతర్యమేమిటని జిల్లా అధికారులు ప్రశ్నిస్తున్నారు. మేఘమథనం పేరుతో డబ్బులు కాజేసేందుకు ఈ ప్రయత్నమని ఆరోపిస్తున్నారు. మేఘమథనం జరిపిన విషయాన్ని జిల్లా కలెక్టరు వద్ద ప్రస్తావించగా... ఆయన అవాక్కయ్యారు. ప్రస్తుతం నిల్వచేరిన వరదనీటిని ఎక్కడికి పంపాలో తెలియక తల పట్టుకుంటుంటే మేఘమథనమేమిటని ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

September 20, 2007

క్లీన్ చిట్?

మావాడికీ ఒక క్లీన్‌చిట్‌ ఇవ్వవయ్యా,
ఎప్పుడేం చేస్తాడో తెలియదు.
ముందే తీసిపెట్టుకుంటే పోలా!
సందర్భం:
రాజకీయ నాయకులు ఏది కావాలన్నా చేయగలరు. ఇటీవల కే.కే కుమారుడు ఆయన స్నేహితుడు ప్రతాప్ రెడ్డి కాల్చి చంపారు. కానీ దానికి రంగు పూసి, ఇప్పుడు అది ఆత్మ హత్య అని నిరూపించేస్తున్నారు. కొంతకాలం క్రితం సినీ నటుడు బాలకృష్ణ కూడా ఒక నిర్మాతని ఇదే విధంగా కాల్చాడు. గుడ్డిలో మెల్ల ఏమిటంటే ఆ నిర్మాత బతికే ఉన్నాడు. అప్పుడు చంద్రబాబు కేసు మాఫీ చేయించాడు. ఇప్పుడు కే.కే మాఫీ చేయిస్తున్నాడు.

September 19, 2007

చంద్రబాబు హస్తం

దీని వెనుక చంద్రబాబు హస్తం ఉంది సార్‌!

September 18, 2007

సమాల్ దెబ్బ

రిటైరవుతున్నావా, అవినీతిమీద
రిపోర్టులు రాయనంటేనే... ఒట్టేసి చెప్పు

September 17, 2007

September 16, 2007

సమాల్ విమర్శలు

దీన్లో జనానికి తెలియని కొత్త విషయాలు
ఏమున్నాయి సార్‌, గొప్పగా చెప్పిందేంటట?

సందర్భం:

''నా గురించి, నా సంస్థ గురించి ఒకమాట'' అంటూ నివేదికను మొదలు పెట్టిన సమాల్‌... తొలుత విజిలెన్స్‌ కమిషన్‌ పూర్వాపరాలు తెలిపారు. 1964లోనే ఏర్పడిందంటూ ''ఇప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా అఖిల భారత సర్వీసుల్లోని చాలామందికి విజిలెన్స్‌ కమిషనంటే ఏంటో తెలీదు. కమిషనర్‌ గురించీ తెలీదు. అధికారంలో ఉన్న నేతలకు నిఘా కమిషనర్‌ పాత్రపై అవగాహనే లేదు. వారికి వ్యక్తిత్వం లేదు. చట్ట నియమాలు పట్టవు. కార్యనిర్వాహక వర్గమే అత్యున్నతమైనదనే తప్పుడు భావనతో ఉన్నారు. వీలైనంత త్వరగా నాలుగు కాసులు వెనకేసుకోవాలనే యావ, సొంత లక్ష్యాలను... సొంత ఎజెండాను తప్ప దేన్నీ సాధించలేని అలవాటు, సంపాదన, వారికి రాష్ట్ర విజిలెన్స్‌ కమిషన్‌పై అవగాహన లేకుండాచేశాయి. కానీ తాము రామచంద్ర సమాల్‌ అనే సింహంపై స్వారీ చేస్తున్నామని వారు తెలుసుకోలేదు. ఆ సింహాన్ని నియంత్రించలేరు. వారి లక్ష్యాలేంటో వారికి తెలుసు. దానికి అనుసరించాల్సిన మార్గాలపై పట్టింపుల్లేవు'' అని తీవ్రంగా విమర్శించారు. వారి తీరు చూస్తే సమాధిలోని మహాత్మగాంధీ సిగ్గుతో మళ్ళీమళ్ళీ మరణిస్తారని పేర్కొన్నారు.
దేశంలో... ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిణామాలు చెబుతానంటూ... నిజాయితీగల అధికారులు అతికొద్దిమందే ఉన్నారని చెప్పారు. అభివృద్ధి పేరిట బ్యూరోక్రాట్లు నిర్వహిస్తున్న భారీ క్రీడలో భూమి రూపంలోని సమాజ సంపద అతివేగంగా తరిగిపోతోందని నిందించారు. హోంమంత్రి జానారెడ్డి గురించి కూడా సమాల్‌ ప్రస్తావించారు. ''ఇంటెలిజెన్స్‌ విభాగం ఆయన పూర్వాపరాలను విచారించి, ఆయన ఆ పదవికి పనికొస్తాడో లేదో ముఖ్యమంత్రికి చెప్పాలి. నేను రాజ్యాంగ చరిత్ర విద్యార్థిని. అనేక దేశాల రాజ్యాంగాల్ని చదివా. అమెరికా తరహా ప్రజాస్వామ్య వ్యవస్థలో రక్షణ మంత్రిని అధ్యక్షుడే నియమిస్తాడు. కానీ అతడి చరిత్రను సెనేట్‌ సమగ్రంగా చర్చిస్తుంది. అవసరమైతే అధ్యక్షుడి నియామకాన్ని తిరస్కరిస్తుంది కూడా. బ్రిటిష్‌ వ్యవస్థలో నేరస్థులు బాధ్యతాయుతమైన పదవి చేపట్టడానికి లేదు. నేరస్థులను రాజకీయాల్లోకి రానివ్వటం, రాజకీయాలను నేరమయం చేయటం మానాలి. దీనికి ఆంధ్రప్రదేశ్‌ మినహాయింపేమీ కాదు. దీని వల్ల పోలీసు విభాగంలోని నేరగాళ్ళు నీతిమంతులుగా, అమాయకులుగా ధ్రువపత్రాలు పొందుతున్నారు. ఇలాంటి జాబితా చాలా పెద్దదే ఉంది. దీన్ని పరిశీలిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి'' అని సమాల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయినా ట్రాఫిక్‌ పోలీసుల వంటి సాధారణ పోలీసు అధికారులపై కేసులు నమోదు చేయటంలేదని సమాల్‌ పేర్కొన్నారు. ''ఒకవేళ ఎవరైనా సిబ్బందిపై కేసులు నమోదు చేస్తే... జానా రెడ్డి నేతృత్వంలోని హోం శాఖ వారిని బయటపడేయటానికి సిద్ధంగా ఉంటుంది'' అని నిందించారు. గనులు, భూగర్భ శాఖ పనితీరును వర్ణించటానికి తనకు మాటలు రావటంలేదని సమాల్‌ పేర్కొన్నారు. ''ఆంధ్రప్రదేశ్‌ భూగర్భాన్ని... సముద్రంలోపల... సముద్రం బయట ఇంత వ్యవస్థీకృతంగా దోపిడి చేయటం ఎప్పుడూ చూడలేదు. దీనిని పరిశీలించాల్సింది తేల్చాల్సింది నిపుణులే'' అన్నారు.
ముఖ్యమంత్రి పేషీలో ఆయనకు ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా ఉన్న వ్యక్తిపై సమాల్‌ విరుచుకుపడ్డారు. తాను సిబ్బంది కోసం ఎన్ని ప్రతిపాదనలు పంపినా ఎవరూ పట్టించుకోలేదని, తామెంత బాగా పనిచేసినా... అవినీతి కార్యదర్శులను పొగిడే ప్రభుత్వం తమనుమాత్రం గుర్తించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సదరు కార్యదర్శి హోదాను అడ్డంపెట్టుకుని ఆయన వియ్యంకుడు నానా అక్రమాలూ చేస్తున్నారని పేర్కొన్నారు. ''ఆయన గిరిజన సంక్షేమ శాఖలో చీఫ్‌ ఇంజినీరే. కానీ అటెండరుగా కూడా పనికిరాడు'' అని దుయ్యబట్టారు.
ఇతర శాఖల అవినీతి ఇదీ... ''జలయజ్ఞం జెట్‌ స్పీడ్‌లో సాగుతోంది. దీంతో అన్ని ఇంజినీరింగ్‌ విభాగాల్లో ప్రస్తుత నాణ్యత నియంత్రణ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రత్యామ్నాయం ఒక భ్రమ. అందరూ కాంట్రాక్టర్లుగా మారిపోయారు. ఐఏఎస్‌ అధికారి చంద్రభాను ప్రకాశిస్తున్నారు. రాష్ట్రంలోని మిగిలిన శాఖలన్నిటికీ నీటిపారుదల శాఖ ఆదర్శంగా మారింది. రోడ్లు, భవనాల శాఖదీ అదే పరిస్థితి'' అని పేర్కొన్నారు. 2004 సెప్టెంబర్‌ 18న ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో వి.ఎస్‌.పాండే అనే సివిల్‌ సర్వెంట్‌ రాసిన వ్యాసాన్నీ సమాల్‌ ప్రస్తావించారు.
ఏసీబీ తీరు దారుణం క్షేత్ర స్థాయి సిబ్బందిపై తప్ప ఉన్నతాధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేయటం లేదని, అమాయకులు వేధింపులకు గురవుతున్నారని సమాల్‌ తన నివేదికలో పేర్కొన్నారు. ''ప్రస్తుత డీజీ కన్నా ముందున్న అధికారి అత్యాధునిక పరికరాలు కొన్నారు. అవిపుడు ఏసీబీకి ఉపయోగపడటం లేదు. ఇదో నిద్రపోతున్న అవినీతి సంస్థ. కొందరు మంచి అధికారులున్నా... వారిని సామర్థ్యం మేరకు పనిచేయనివ్వటం లేదు'' అన్నారు. ఏసీబీ నెలనెలా జిల్లాల వారిగా నివేదిక తయారుచేస్తుందంటూ... ''దీనిలో రహస్యంగా చేసిన విచారణలు, ఆకస్మిత తనిఖీలు, సాధారణ విచారణలు, నమోదైన కేసుల వివరాలుంటాయి. ఈ నివేదికనలు చూస్తే క్షేత్రస్థాయి సిబ్బందిపై వ్యక్తిగత కక్షలను తీర్చుకోవటానికి కేసులు నమోదు చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది'' అని సమాల్‌ విమర్శించారు. విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్‌లలోని ప్రత్యేక కోర్టుల్లో- ఛార్జి షీట్లు దాఖలు చేయటంలో అపరిమితమయిన జాప్యం జరుగుతోందన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంటూ అంతే... డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థనూ సమాల్‌ విమర్శించారు. ''దీన్ని 1985లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన ఆర్థిక, ఇతర నేరాలను దర్యాప్తు చేసే అధికారాల్ని కట్టబెట్టింది. దీనంత అసమర్థ సంస్థ మరొకటి లేదు. ఇలాంటి వాటివల్ల ప్రజాధన దుర్వినియోగం తప్ప మరేం జరగదు. ఈ సంస్థలో కనీసం 561 నుంచి 644 మంది సిబ్బంది ఖాళీగా కూర్చుంటున్నారు. ఇది అనవసరమైన నివేదికలు తయారుచేస్తుంది. అవి చెత్త బుట్టల్లో వేయటానికి తప్ప దేనికీ పనికిరావు. ఇలాంటి సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి'' అని పేర్కొన్నారు. గతంలో ఒకసారి ఈ సంస్థ సమర్థుడైన డీజీ నేతృత్వంలో బాగా పనిచేసిందని, ఇపుడు మాత్రం అలాంటిదేమీ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం డీజీ ఉత్సాహంగా ఈ సంస్థలో చేరారని, చేరినప్పటి ఉత్సాహం ఆయనలో ఇప్పుడు లేదని తెలిపారు.
ఎన్నెన్నో ప్రస్తావనలు... దేశంలో అవినీతికి సంబంధించి వివిధ న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యలను సమాల్‌ తన నివేదికలో ప్రస్తావించారు. ట్రాన్స్‌పరెన్సీ వంటి సంస్థలిచ్చిన ర్యాంకులనూ ఉదహరించారు. పలు కేసుల్లో తానెంత జాగ్రత్తగా పరిశీలించి శిక్షలకు సిఫారసు చేసిందీ వివరిస్తూ... కొందరు అధికారులు నిజాయతీగా వ్యవహరించటంవల్ల కేసుల పరిశోధన ఎంత సులభమైందో కూడా చెప్పారు. వారి పేర్లను ప్రస్తావించారు. కొన్ని కేసుల్లో తాము ఆయా విభాగాలకు సిఫారసులు చేసినా.... తరవాత వాటిని గుర్తు చేస్తూ లేఖలు రాసినా కూడా పట్టించుకోలేదంటూ కొన్ని సంఘటనల్ని ఉదహరించారు. అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునళ్ళను సమాల్‌ విమర్శించారు. అవి రిటైర్డ్‌ అధికారులకు పునరావాస కేంద్రాలవుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు పలుమార్లు ట్రిబ్యునళ్ళ పరిధులను వివరిస్తూ రూలింగ్‌లు ఇచ్చినా ఇప్పటికీ పలు ట్రిబ్యునళ్ళు తమకు సంబంధం లేని అంశాలపై ఉత్తర్వులిస్తున్నాయని చెప్పారు.
వివిధ విభాగాల్లో చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్లను, విజిలెన్స్‌ ఆఫీసర్లను నియమించకపోవటం, కొన్నిచోట్ల అసమర్థుల్ని నియమించటం తమ పనితీరుపై తీవ్రంగా ప్రభావం చూపిందని సమాల్‌ పేర్కొన్నారు. నిబంధనలప్రకారం వారి నియామకాలను విజిలెన్స్‌ కమిషనర్‌ ఆమోదంతో చేపట్టాల్సి ఉన్నా సమాచారం కూడా ఇవ్వకుండా కొందరిని నియమించి, విజిలెన్స్‌ కమిషన్‌ చెవులు, కళ్ళు మూసేశారని ఆవేదన వ్యక్తంచేశారు.
సమాల్‌ వ్యాఖ్యలు మరికొన్ని... *కొన్నేళ్ళుగా చూస్తే అవినీతి, అక్రమార్జనతో ముడిపడిన కేసులు, నేరాలు పెరిగిపోతున్నాయి. ఆయా విభాగాల్లో ఈ కేసుల్ని చూడాల్సిన నిఘా విభాగాల సామర్థ్యం పడిపోతోంది. ఎక్కువమంది ఉద్యోగులుండే కీలక విభాగాలు తమ ఉద్యోగులపై అదుపు కోల్పోయాయి. నీటిపారుదల, రవాణా, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి తదితర విభాగాల్లో బడ్జెట్‌ భారీగా పెరగటంతో పాటు వాటిని వేగంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాణ్యత మాత్రం ఎవరికీ పట్టడం లేదు. అత్యున్నత స్థాయుల్లో సమర్థులైన అధికారుల కొరత చాలా ఉంది. అసమర్థ, అవినీతి అధికారులవల్ల ఖజానా గుల్లవుతోంది. ప్రజా ధనం ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి పోతోంది.
*ఇక వాణిజ్య పన్నులు, ఎక్సైజు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, గనుల వంటి ఆదాయార్జన ఉండే విభాగాలది మరో దారి. వీటిల్లో టార్గెట్లు పెంచటంతో ఏడాదికేడాది రెవెన్యూ పెరిగిపోతోంది. అవినీతి ఈ విభాగాల మూలాల్లోకి చేరుతోంది. వీటన్నిటి ఫలితంగా వివిధ విభాగాల్లో విజిలెన్స్‌, అవినీతి నిరోధక సిబ్బందిపై పని భారం ఎక్కువైంది. తప్పుచేసినవారు తప్పించుకోవటం సులభమైంది. ఏసీబీ, విజిలెన్స్‌ వంటి దర్యాప్తు సంస్థల్లోనూ సమర్థత దారుణంగా క్షీణించింది. విపరీతమైన రాజకీయ ఒత్తిళ్ళు, బెదిరింపులతో ఈ విభాగాల అధిపతులు కళ్ళుమూసుకోవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో ప్రతివారూ పనిచేయటం మాని ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయటం మొదలెట్టారు. తమ దగ్గరకొచ్చిన వారి పనులు చేసిపెట్టడానికి లంచాలు తీసుకోవటం మొదలెట్టారు. దీనికంతటికీ కారణం ఉన్నతాధికారులే.
అవినీతి బయటపడినా... ''కె.రమ అనే అధికారిణి విపరీతంగా అక్రమాస్తులు కూడబెట్టింది. నిజానికి కోర్టులో కేసు తేలేవరకూ ఆ అధికారిణిని సస్పెన్షన్‌లో ఉంచాలి. కానీ విజిలెన్స్‌ కమిషన్‌తోగానీ ఏసీబీతోగానీ సంప్రతించకుండా ఈమెకు మళ్ళీ పదవిచ్చేశారు'' అని సమాల్‌ తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల అక్రమార్జన చేసేవారికి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. ఆమెకు మళ్లీ ఉద్యోగమివ్వటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

September 15, 2007

వినాయక చవితి శుభాకాంక్షలు


జయని కలవనున్న అద్వానీ

రండి సార్‌, కూర్చోండి, మేడంగారు రెండు నిమిషాల్లో వస్తారు

September 14, 2007

రంజాన్ మాసం ఆరంభం

ఈ నెలంతా ప్రోగ్రాములన్నీ రద్దుచెయ్యి.
ఇఫ్తార్‌ విందులకు మాత్రమే ఓకే చెప్పు.

September 12, 2007

హైదరాబాద్ నగరంలో ప్రముఖ ప్రదేశాలు

... అది కూలిన ఫ్త్లెఓవర్‌, ఇది పేలిన పార్కు...
ఆ ముందుకు వెళ్తే కేకే కుమారుడి ఇల్లు...

September 11, 2007

September 9, 2007

రామోజీ ఫిలింసిటీపై జులుం

... మిగతా అసైన్డ్‌ భూముల లిస్టు తెచ్చా సార్‌,
ఇల్లు, టి.డి.పి. ఆఫీసు, సుందరయ్య విజ్ఞానకేంద్రం,
మఖ్దూం భవన్‌, ఈనాడు ఆఫీసు...
సందర్భం:
కక్ష సాధింపునకిది పరాకాష్ఠ. ప్రభుత్వ యంత్రాంగం తాను తలచుకుంటే ఎంతలా బరితెగించగలదో చెప్పడానికిది ప్రత్యక్ష నిదర్శనం. నిజానిజాల నిర్ధారణ లేదు... బాధిత పక్షానికి వాదన చెప్పుకునే అవకాశం లేదు. ఎన్ని చెప్పినా, ఎన్ని ఆధారాలు చూపించినా... తాము చేయాలనుకున్న విధ్వంసాన్ని చేసి తీరతామన్నట్లుంది రాష్ట్ర ప్రభుత్వ తీరు. సహజ న్యాయ సూత్రాలకు తిలోదకాలిచ్చేసి... సర్వం సహా చక్రవర్తి అన్న రీతిలో ఫిలిం సిటీపై జులుం మొదలెట్టింది. అద్భుత కళాఖండంగా.. అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా.. దేశ విదేశీ ప్రముఖుల నుంచి ప్రశంసలందుకున్న రామోజీ ఫిలింసిటీ విషయంలో ప్రభుత్వ కర్కశత్వం తారస్థాయిని దాటిపోయింది. రికార్డులన్నీ పరిశీలించి... పక్కాగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరవాతే కొనుగోలు చేసిన పట్టా భూముల్ని సర్కారు అసైన్డ్‌ భూములుగా చిత్రిస్తోంది. లక్షల విలువైన భవనాలను కేవలం 'ఈనాడు' గ్రూపుపై కక్షతో కూల్చివేయటానికి దిగింది. 'మేం కూల్చాలనుకున్నాం. కూల్చేస్తున్నాం. మీరు ఏం చెప్పినా వినం' అనే రీతిలో చట్టపాలనకు సొంత అర్థాన్ని చెబుతోంది.

September 8, 2007

ఉత్తమ పార్లమెంటేరియన్లు

మరి మిగతావాళ్లు?
సందర్భం:
ప్రతిష్ఠాత్మక 'ఉత్తమ పార్లమెంటేరియన్‌' పురస్కారాలకు సీనియర్‌ ఎంపీలు శరద్‌పవార్‌, సుష్మాస్వరాజ్‌, చిదంబరం, మణిశంకర్‌ అయ్యర్‌లు ఎంపికయినట్టు విశ్వనీయంగా తెలిసింది. స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీతో కూడిన జ్యూరీ... 2003 నుంచి వరుసగా సంవత్సరాలకు వీరిని ఎంపిక చేసింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి, సభా విలువల పరిరక్షణకు విశేషంగా కృషిచేసే ఎంపీలను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. గత నాలుగేళ్లుగా ఈ అవార్డులను ప్రకటించడం లేదు. దీంతో తాజాగా ఒకేసారి 2003 నుంచి 2006 వరకు నలుగురు ఎంపీల పేర్లు ఖరారు చేశారు. ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ 2003కు, భాజపా నాయకురాలు సుష్మా స్వరాజ్‌ 2004కు, ఆర్థికమంత్రి చిదంబరం 2005కు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ 2006 సంవత్సరానికి ఎంపికయ్యారు. వీరి పేర్లను భారత పార్లమెంటరీ గ్రూప్‌ పాలకమండలి ఇంకా ఆమోదించాల్సి ఉందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. చివరిగా, 2002లో ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డును ఎంపీ హోదాలో మన్మోహన్‌సింగ్‌ అందుకున్నారు.

September 7, 2007

రాష్ట్రంలో తృతీయ పక్షం

కేంద్రంలో కూడా తృతీయఫ్రంట్‌ అక్కర్లేదని బీజేపీ చెబుతోంది సార్‌!


September 6, 2007

చిరంజీవి ఇంటికి వామపక్షాల నేతలు

రాజకీయాలుకాదు ఏంగాదు. భూపోరాటంలో
కొన్నిసార్లు ఫైటింగులు జరుగుతున్నాయి.
చిరంజీవి దగ్గర నేర్చుకుందామని వెళ్లాం కామ్రేడ్‌!

September 5, 2007

బాంబుదాడి కేసు దర్యాప్తు

బాంబుదాడి నిందితుల్ని పట్టుకోగలమా స్వామీ

September 4, 2007

కృష్ణావతారం

దుర్మార్గం పెరిగితే మళ్లీ అవతరిస్తానన్నావుగా, ఇంకెప్పుడు స్వామీ?

September 3, 2007

బంగ్లా దేశీయుడికి రేషన్ కార్డు

రేషన్‌కార్డూ, ప్యాన్‌కార్డూ, పాలకార్డూ, క్రెడిట్‌కార్డులూ,
పాస్‌పోర్టూ, డ్రైవింగ్‌ లైసెన్సూ... అన్నీ ఉన్నాయి సార్‌,
బంగ్లా దేశీయుడేమోనని అనుమానం వచ్చింది.
ఇక్కడివాడికి ఇవన్నీ ఎట్లా దొరుకుతాయి సార్‌!
సందర్భం:
లుంభిని ఉద్యానవనం, గోకుల్ చాట జంట పేలుళ్ళ అనంతరం జరిగిన తనిఖీలలో ఒక బంగ్లాదేశీ మహిళ పట్టుబడ్డది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమే కుటుంబం మొత్తం హైదరాబాదులోనే ఉన్నది. మరియు వారికి రేషన్‌కార్డూ, ప్యాన్‌కార్డూ మొదలైనవి అన్నీ కూడా ఉన్నాయి. అవినీతి ఏ స్ధాయికి వెళ్ళిపోయిందో!!

September 2, 2007

తీవ్రవాదుల ఊహాచిత్రాల విడుదల

మనం విడుదల చేసిన తీవ్రవాది
ఊహాచిత్రంలా ఉన్నవాళ్లు సార్‌!

September 1, 2007

పోలీసులకు స్వేచ్ఛేది

పోలీసులకు స్వేచ్ఛనిస్తే మనందర్నీ
లోపలేస్తారయ్యా, అలా మాట్లాడుతావేం?