September 9, 2007

రామోజీ ఫిలింసిటీపై జులుం

... మిగతా అసైన్డ్‌ భూముల లిస్టు తెచ్చా సార్‌,
ఇల్లు, టి.డి.పి. ఆఫీసు, సుందరయ్య విజ్ఞానకేంద్రం,
మఖ్దూం భవన్‌, ఈనాడు ఆఫీసు...
సందర్భం:
కక్ష సాధింపునకిది పరాకాష్ఠ. ప్రభుత్వ యంత్రాంగం తాను తలచుకుంటే ఎంతలా బరితెగించగలదో చెప్పడానికిది ప్రత్యక్ష నిదర్శనం. నిజానిజాల నిర్ధారణ లేదు... బాధిత పక్షానికి వాదన చెప్పుకునే అవకాశం లేదు. ఎన్ని చెప్పినా, ఎన్ని ఆధారాలు చూపించినా... తాము చేయాలనుకున్న విధ్వంసాన్ని చేసి తీరతామన్నట్లుంది రాష్ట్ర ప్రభుత్వ తీరు. సహజ న్యాయ సూత్రాలకు తిలోదకాలిచ్చేసి... సర్వం సహా చక్రవర్తి అన్న రీతిలో ఫిలిం సిటీపై జులుం మొదలెట్టింది. అద్భుత కళాఖండంగా.. అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా.. దేశ విదేశీ ప్రముఖుల నుంచి ప్రశంసలందుకున్న రామోజీ ఫిలింసిటీ విషయంలో ప్రభుత్వ కర్కశత్వం తారస్థాయిని దాటిపోయింది. రికార్డులన్నీ పరిశీలించి... పక్కాగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరవాతే కొనుగోలు చేసిన పట్టా భూముల్ని సర్కారు అసైన్డ్‌ భూములుగా చిత్రిస్తోంది. లక్షల విలువైన భవనాలను కేవలం 'ఈనాడు' గ్రూపుపై కక్షతో కూల్చివేయటానికి దిగింది. 'మేం కూల్చాలనుకున్నాం. కూల్చేస్తున్నాం. మీరు ఏం చెప్పినా వినం' అనే రీతిలో చట్టపాలనకు సొంత అర్థాన్ని చెబుతోంది.

No comments: