September 21, 2007

హోరువానలో మేఘమథనం

చూశారా, మేం మేఘమథనం చేయగానే
వాన ఆగిపోయింది, లేకుంటే మరిన్ని వరదలు వచ్చేవి.

సందర్భం:
బంగాళాఖాతంలో అల్పపీడనం... చురుగ్గా మారిన నైరుతి రుతుపవనాలు.. మూడు రోజులుగా ఎడతెరిపిలేని వానలు..ఈ హోరువానను చూడగానే జేఎన్‌టీయూ అధికారులకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెరైటీగా జోరు వానలోనే మేఘమథనం చేయాలనిబయలుదేరారు. రయ్యిమని విమానంలో వచ్చి, కడప జిల్లాలోని ఒక్క కొండాపురం మండలం మినహా మిగతా అన్ని మండలాల్లో మేఘమథనం చేశారు. ఇదేమీ చోద్యం..! సహజంగా వర్షాలు కురుస్తుంటే ఈ మేఘమథనం ఏంటీ? అని జిల్లా అధికారులు నోరెళ్లబెడుతున్నారు. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నుంచి కడప జిల్లాలో కూడా వానలు విస్తృతంగా పడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ ప్రొద్దుటూరు పర్యటన కూడా వాయిదా పడింది.అయినా, అదేరోజు జేఎన్‌టీయూ అధికారులు జిల్లాలో మేఘమథనం జరిపారు. ఆ తర్వాత ముఖ్య ప్రణాళిక అధికారి(సీపీవో) కార్యాలయానికి సమాచారం చేరవేశాయి. కార్యాలయ అధికారులు నమూనాలు తీసి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు పంపారు. ఆ నమూనాల ఆధారంగా ప్రస్తుతం కురిసిన వర్షం సహజమైందా? మేఘమథనం కారణంగా పడిందా అనేది నిర్ధరించాల్సి ఉంది. మరోవైపు సహజంగా వర్షాలు పడుతున్నా మేఘమథనం చేయడంలో ఆంతర్యమేమిటని జిల్లా అధికారులు ప్రశ్నిస్తున్నారు. మేఘమథనం పేరుతో డబ్బులు కాజేసేందుకు ఈ ప్రయత్నమని ఆరోపిస్తున్నారు. మేఘమథనం జరిపిన విషయాన్ని జిల్లా కలెక్టరు వద్ద ప్రస్తావించగా... ఆయన అవాక్కయ్యారు. ప్రస్తుతం నిల్వచేరిన వరదనీటిని ఎక్కడికి పంపాలో తెలియక తల పట్టుకుంటుంటే మేఘమథనమేమిటని ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

No comments: